Friday 17 January 2020

indian heroines who married young in telugu

తమకన్నా తక్కువ వయసున్న హీరోలను పెళ్లాడిన హీరోయిన్లు ఎవరో తెలుసా ??


1. నమ్రత శిరోద్కర్ :   

నమ్రత టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో పరిచయం అక్కరలేని పేరు. ఈమె 22 జనవరి '1972 లో వనితా శిరోద్కర్, నితిన్ శిరోద్కర్లకు జన్మించారు. నమ్రత 1993 లో ఫెమినా మిస్ ఇండియా అవార్డును అందుకుంది. ఈమె తెలుగు కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని ఫిబ్రవరి 10 ' 2005 న వివాహం చేసుకున్నారు. మహేష్ బాబు నమ్రత కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడు. 

2.  ఐశ్వర్య  రాయ్ :

ఐశ్వర్య  రాయ్ 1973 నవంబర్ 1 న జన్మించింది . 1994 వ సంవత్సరంలో మిస్ వరల్డ్ పోటీలలో విజేతగా నిలిచింది. తన అందం , అభినయంతో యావత్ సినీ అభిమానుల నుంచి ఆదరణ పొందింది. ఐశ్వర్య  రాయ్ పేరు తెలియని వారు మన దేశంలో వుండరు అంటే అతిశయోక్తి కాదు. ఈమె ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కుమారుడైన అభిషేక్ బచ్చన్ తో ఏప్రిల్ 20, 2007 లో వివాహం జరిగింది. అభిషేక్ బచ్చన్ ఫిబ్రవరి 5' 1976 లో జన్మించాడు. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ కన్నా మూడు సంవత్సరాలు వయసులో  చిన్నవాడు .


3. ప్రియాంక చోప్రా :

ప్రియాంక చోప్రా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా బిజీ అయిపోయింది . ఈమె తనకన్నా పది సంవత్సరాలు చిన్నవాడైన అమెరికన్ గాయకుడు, నటుడు అయిన నిక్ జోనస్ ని వివాహం చేసుకుంది. ప్రియాంక చోప్రా జులై 18' 1982 లో జన్మించగా, నిక్ జోనస్ సెప్టెంబర్ 16' 1992 లో జన్మించాడు. వీరిరువురు డిసెంబర్ 1' 2018 న వివాహం చేసుకున్నారు.

4. ఊర్మిళ మటోద్కర్ :

ఊర్మిళ మటోద్కర్ తన నటనతో అందంతో సినిమా ప్రేక్షకులని కట్టిపడేసింది . ఈమె రామ్ గోపాల్ వర్మ దర్వకత్వంలో వచ్చిన రంగేళి సినిమా ఘనవిజయాన్ని సాధించింది. ఒక్క సినిమాతో తెగ క్రేజ్ సంపాదించుకుంది. ఊర్మిళ మటోద్కర్ ఫిబ్రవరి 4 '1974 లో జన్మించింది. ఈమె తనకన్నా వయసులో 8 సంవత్సరాలు చిన్నవాడైన మోసిన్ అక్తర్ మిర్ ను మార్చి 3' 2016 న వివాహం చేసుకుంది.

ప్రముఖ హీరోయిన్ ఆర్తీఅగర్వాల్ ఎలా చనిపోయిందో తెలుసా ?


indian heroines who married young in telugu

తమకన్నా తక్కువ వయసున్న హీరోలను పెళ్లాడిన హీరోయిన్లు ఎవరో తెలుసా ?? 1. నమ్రత శిరోద్కర్ :    నమ్రత టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో పరిచయం అక...