Showing posts with label Warren Buffet school. Show all posts
Showing posts with label Warren Buffet school. Show all posts

Friday 2 August 2019

ప్రపంచ ధనవంతుడు వారెన్ బఫెట్ కుటుంబం గురించి ఆసక్తి విషయాలు !!

అతి చిన్న వయసులో సంపాదించడం మొదలుపెట్టి , రోజురోజుకు హన ఆలోచన పరిధిని పెంచుకుంటూ, వివిధ విభాగాలలో డబ్బుని పెట్టుబడిగా పెడుతూ ఆర్థికంగా అంచలంచెలుగా  ఎదుగుతూ, సాంకేతిక యుగంలోకూడా అతి సాధారణ జీవితం గడుపుతూ..ఆర్థికంగా ఎదగడానికి సూచనలు ఇస్తూ , విభిన్న ఆలోచనలు, వైవిధ్యమైన ఆచరణతో, ఆర్ధిక రంగంతోపాటు, సామజిక సేవతో తనదైన శైలిలో ముందుకు వెళుతూ, కోట్ల మందిలో ఒక్కడిగా ఉన్న "వారెన్ బఫెట్ " బాల్యం గురించి తెలుసుకుందాం....

                  "  వారెన్ ఎడ్వార్డ్ బఫెట్ " బఫెట్ పూర్తి పేరు. బఫెట్ ఆగష్టు , 1930 లో నెబ్రాస్ఖలోని , ఒమాహాలో పుట్టారు. బఫెట్ నాన్న పేరు హోవార్డ్ బఫెట్. అమ్మ పేరు లీలా బఫెట్. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. వారిలో బఫెట్ రెండవవాడు.

Warren Buffet Child Hood Photos, Warren Buffet age, Warren Buffet school
Warren Buffet Child Hood Photos


                    బఫెట్ చిన్నప్పుడు తన తాతగారి కిరాణా షాపులో పనిచేసేవాడు. అంతేకాకుండా వార్తాపత్రికలు, స్టాంపులు అమ్మేవాడు. బఫెట్ 11 ఏళ్ళ వయసులోనే షేర్లను కొన్నాడు. 13 ఏళ్లకే ఆదాయపు పన్ను రాబడికి దాఖలు చేసుకున్నాడు. అంత చిన్న వయసులోనే బఫెట్ ఇన్ని చేయడం మామూలు విషయం కాదు. బఫెట్ D .C లోని వుడ్రోవిల్సన్ హైస్కూల్ లో విద్యాభ్యాసము చేశారు. 1950లో నెబ్రాస్కా విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో B .S పట్టా అందుకున్నాడు.

 తాను ఎంతగానో అభిమానించే, ప్రఖ్యాత రక్షణ విశ్లేషకులైన బెంజిమన్ గ్రాహం ( ది ఇంటిలిజెన్స్ ఇన్వెస్టర్ రచయిత ) మరియు డేవిడ్ డాడ్ లు కొలంబియా బిజినెస్ స్కూల్ లో భోదకులుగా వున్నారని తెలుసుకొని బఫెట్ ఆ విశ్వవిద్యాలయంలో చేరాడు. 1951 లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో M .S పట్టా అందుకున్నాడు. తన అభిమాన బోధకుల దగ్గరనుంచి బఫెట్ నేర్చుకున్న ఆర్ధిక మెలకువలతో సరికొత్త సూత్రాలతో , ఆర్థిక వ్యవస్థను శాసించడం మొదలుపెట్టాడు....

indian heroines who married young in telugu

తమకన్నా తక్కువ వయసున్న హీరోలను పెళ్లాడిన హీరోయిన్లు ఎవరో తెలుసా ?? 1. నమ్రత శిరోద్కర్ :    నమ్రత టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో పరిచయం అక...