జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న నందమూరి తారక రామారావు మనవడు, హరికృష్ణ కొడుకు.తెలుగు ప్రజల చేత తాతకు తగ్గ మనవడు , తాతకు సరైన వారసుడు అని అనిపించుకున్నాడు ఎన్టీఆర్. పోలికలలో అచ్చం సీనియర్ ఎన్టీఆర్ లాగ ఉండటమే కాకుండా, నటనలో కూడా తాతగారికి ఏమాత్రం తీసిపోడు. తెలుగులో ఏ హీరోకి లేని క్రేజ్ ఎన్టీఆర్ సొంతం. అంతలా తన నటనతో, డాన్సులతో అందర్నీ ఆకట్టుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ హిట్లని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మే 7, 2011 లో లక్షిప్రణతిని వివాహం చేసుకున్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరి వివాహానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే లక్ష్మి ప్రణతి , ఎన్టీఆర్ కన్నా 10 సంవత్సరాలు చిన్నది కావడంతో పలు విమర్శలు వచ్చాయి. ప్రణతికి పెళ్లి సమయానికి 18 సంవత్సరాలే అవ్వటంతో పలు విమర్శలు వచ్చాయి. వీరిరువురు మధ్య వయసులో తేడా ఉన్నప్పటికీ అర్థం చేసుకోవడంలో నూటికి నూరు మార్కులు పడ్డాయి. ఎన్టీఆర్ , లక్ష్మి ప్రణతి జంట మాత్రం అన్యోన్యంగా వుంటూ, ఆనందంగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ సంతానం. అటు పర్సనల్ , ఇటు ప్రొఫెషనల్ కెరీర్ ని బ్యాలన్స్ చేస్తూ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ..
|
jnr ntr marriage images |
|
jnr ntr and lakshmi pranathi marriage images | ciniaddict |
|
|
NTR & Lakshmi Pranathi Wedding photos | ciniaddict |