Showing posts with label Magadheera. Show all posts
Showing posts with label Magadheera. Show all posts

Sunday 28 July 2019

S.S. Rajamouli Movies List | S.S . Rajamouli All Movies| ciniaddict

ఎస్.ఎస్ రాజమౌళి.....ఈయన పేరు తెలియని తెలుగువారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్నప్పటికీ రాజమౌళి ప్రత్యేకం. ఇందుకు ఆయన తీసిన సినిమాలే నిదర్శనం. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు ఏవో తెలుసుకుందాం .

1. స్టూడెంట్ నెంబర్ వన్ :


       ఈ చిత్రం 2001 వ సంవత్సరంలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ , గజాల జంటగా నటించారు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఎన్టీఆర్ . ఏ హీరోకి అయినా సక్సెస్ ఇచ్చే దర్శకుడంటే చాలా అభిమానం ఉంటుంది. సక్సెస్ ఇచ్చిన దర్శకుడి తోనే సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. అందుకే ఎన్టీఆర్ ఈ దర్శకుడితో ఏకంగా మూడు సినిమాలలో నటించాడు. ప్రస్తుతం నాలుగో సినిమా అయిన RRR లో నటిస్తున్నారు ఎన్టీఆర్ .
student number one movie, student number one movie images
student number one movie|  ciniaddict


2.సింహాద్రి :


               సింహాద్రి ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన రెండవ సినిమా. ఈ సినిమా 2003 వ సంవత్సరంలో విడుదలైంది. ఎన్టీఆర్ , భూమిక చావ్లా , అంకిత కలిసి నటించారు. నాసర్, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, వేణుమాధవ్, కోటశ్రీనివాసరావు, చలపతిరావు, హేమ, రవిబాబు మొదలగు వారు ముఖ్యపాత్రాలలో నటించారు. భారీ తారాగణం, ఎక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 150 రోజులకి పైగా థియేటర్ లో ఆడింది అంటే అర్ధం చేసుకోవాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో. సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు. దీనితో రాజమౌళి తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నాడు.
Simhadri movie, simhadri movie images, ciniaddict.blogspot.com
Simhadri movie| Simhadri movie images| ciniaddict


3.సై :


                ఈసారి రాజమౌళి నితిన్ హీరోగా , జెనీలియా హీరోయిన్ గా సై సినిమాకి దర్శకత్వం వహించాడు.క్రీడాస్పూత్తిని కలిగించే సినిమా ఇది. ఈ సినిమా 2004లో విడుదలైంది. కొత్త కథ కావటం, అందులోనూ యూత్ ని ఆకర్షించే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉండటంతో భారీ విజయాన్ని అందుకుంది.


4. ఛత్రపతి:

             ఎస్.ఎస్ రాజమౌళి సినిమాలలో కథే హీరో. అందుకు నిదర్శనం ఛత్రపతి  సినిమా. ప్రభాస్ , శ్రియ శరన్ హీరో, హీరోయిన్ లగా నటించారు. భానుప్రియ ఈ సినిమాలో హీరో తల్లిపాత్రలో నటించారు. ప్రదీప్ రావత్ ప్రతినాయకుడు పాత్రలో నటించారు. ఛత్రపతి సినిమా 2005 సెప్టెంబర్, 30 న విడుదలైంది. ఈ సినిమా భారీ కలెక్షన్లని రాబట్టింది. ప్రభాస్ సినీ కెరీర్ లో ఛత్రపతి సినిమాతో పెద్ద హిట్ ఇచ్చాడు రాజమౌళి. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన ఎం.ఎం. కీరవాణికి నంది అవార్డు లభించింది. అంతే కాకుండా ఉత్తమ సహాయక నటిగా భానుప్రియ నంది అవార్డు సొంతం చేసుకుంది.
chatrapathi movie images,chatrapathi movie, ciniaddict
chatrapathi movie images| ciniaddict


5. విక్రమార్కుడు:

            విక్రమార్కుడు..!! ఇప్పటికే  రాజమౌళి తన సత్తాని చాటుకున్నాడు. విక్రమార్కుడు సినిమా 2006వ సంవత్సరంలో విడుదలైంది. విక్రమార్ఖుడు సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ, అనుష్క శెట్టి జంటగా నటించారు. దొంగని, పోలీస్ ని  హీరోలో చూపిస్తూ ఒక సరికొత్త కథతో సినిమాని తెరకెక్కించిన తీరు చూస్తే రాజమౌళి ప్రతిభ ఏంటో అర్ధమవుతోంది.

6. యమదొంగ :

              ఎన్టీఆర్ , రాజమౌళి కంబినేషన్లో వచ్చిన మూడో సినిమా యమదొంగ 2007' ఆగష్టు, 15 న విడుదలైంది.. ఈ సినిమా రాజమౌళి సినిమాలన్నింటిలోకి విభిన్నమైనది. ఈ సినిమాలో ఎన్టీఆర్  సరసన ప్రియమణి నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు, కుష్బు , మంథా మోహన్ దాస్, బ్రహ్మానందం, అలీ, రాజీవ్ కనకాల, ఎం.ఎస్.నారాయణ, రంభ, అర్చన, నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు.స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ సినిమాలతో హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్ . 

7. మగధీర :

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రెండవ సినిమా మగధీర. ఈ సినిమా 2009లో విడుదలైంది. ఈ సినిమాతో తన తడాఖా ఏంటో చూపించాడు రాజమౌళి. ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు హిట్టే. ఇంక మగధీర సినిమా విజయం  గురించి  చెప్పనక్కర్లేదు. విడుదలైన చాలా రోజుల వరకు మగధీర మ్యానియా ప్రేక్షకులలో నుంచి పోలేదు. కథ, కథనం, పాటలు, పోరాట సన్నివేశాలు, డాన్సులు అన్ని ప్రేక్షకులని కట్టిపడేశాయి. రామ్ చరణ్ , కాజల్ తమ పాత్రలలో లీనమై నటించారు. శ్రీహరి, రావు రమేష్,సునీల్, దేవ్ గిల్  తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాని చూసినవారు  రాజమౌళికి  ప్రశంసల వర్షం కురిపించారు.

8. మర్యాద రామన్న:

          ఎన్నో భారీ విజయాలు, పెద్ద హీరోలతో పని చేసిన రాజమౌళి ఈసారి ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. అదే మర్యాదరామన్న. ఈ సినిమా 2010లో విడుదలైంది. కమెడియన్ సునీల్ ఈ సినిమాలో కథానాయకుడు. కమెడియన్ ఏంటి ? రాజమౌళి సినిమాలో హీరో ఏంటి ? అనుకోవడం సహజం. అప్పట్లో అందరూ అలాగే అనుకున్నారు. మనం ముందుగా చెప్పుకున్నట్లు రాజమౌళి సినిమాలో కథే హీరో. అలాగని సునీల్ ని తక్కువ అంచనా వేయకూడదు. అతను ఈ సినిమాలో చాలా చక్కగా నటించాడు. సునీల్ కి జంటగా సలోని నటించింది. పెద్ద హీరో కాకపోయినా దర్శకుడు రాజమౌళి కాబట్టి ప్రేక్షకులలో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ప్రేక్షకుల అంచనాలకి ఏమాత్రం తీసిపోకుండా తీసాడు రాజమౌళి.
Magadheera,Magadheera2,Magadheera songs, srihari in Magadheera
Magadheera Movie| S.S.Rajamouli Magadheera Movie|ciniaddict

9.ఈగ :


               సంచలన దర్శకుడు ఈసారి ఈగ మంత్రంతో మాయచేసాడు. ఏకంగా ఈగనే హీరోని చేసాడు రాజమౌళి. సినిమాలో పెద్ద హీరో అక్కరలేదని, బలమైన కథే హీరో అని నిరూపిస్తున్నాడు రాజమౌళి. 2012లో ఈగ సినిమా విడుదలైంది. ఈ సినిమా తెలియని తెలుగు ప్రేక్షకుడు లేదనేది వాస్తవం. నాచురల్ స్టార్  నాని చిన్న రోల్ ప్లే చేసాడు. ఈగ సినిమాలో ప్రధాన పాత్రలో సుదీప్ నటించారు. కొత్త కథ అవ్వడంతో  ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరించారు. తెలుగు వాళ్ళు కొత్త కథలని ఆదరిస్తారనడానికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లే నిదర్శనం.

10. బాహుబలి :

               ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తిని చాటిన సినిమా బాహుబలి. 2013 లో మొదలయింది బాహుబలి మ్యానియా .. మొదట్లో ఈ మ్యానియా తెలుగు ప్రేక్షకులలో ఉన్నప్పటికీ, బాహుబలి ది బిగినింగ్ విడుదల తర్వాత ప్రపంచమంతా బాహుబలి మ్యానియాలో పడిపోయింది. బాహుబలి మొదటి భాగం విడుదలైన తర్వాత అందరిలో ఒకటే ప్రశ్న అదే "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?". ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూసారు. నిరీక్షణ ఫలించి 2017లో బాహుబలి రెండవ భాగం విడుదలైంది. కట్టప్ప బాహబలిని ఎందుకు చంపారో తెలిసిపోయింది. ఈ సినిమాలో ఉన్న మాహిష్మతి రాజ్యం వంటి భారీ సెట్టింగులు ప్రేక్షకులని కట్టిపడేశాయి.

           ఇంత గొప్ప సినిమాలో నటించాలంటే అదృష్టముండాలి. ఈ సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా, దగ్గుబాటి రానా ప్రతినాయకుడిగా నటించారు. అనుష్క, తమన్నా కథానాయికలు. అత్యంత శక్తివంతమైన పాత్రలో రమ్యక్రిష్ణ నటించారు. సత్యరాజ్, నాసర్, అడివి శేష్, మేకా రామక్రిష్ణ , సుబ్బరాజు, సుదీప్,భరణి ముఖ్య పాత్రలలో నటించారు.

                 ఇంకా కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచం  మొత్తం రికార్డు స్థాయిలో వసూళ్ళని రాబట్టింది. బాహుబలి ది బిగినింగ్ 650 కోట్లు,  బాహుబలి ది కంక్లూషన్ 1810 కోట్లు వసూలుచేసింది..ఎంతైనా రాజమౌళి గ్రేట్ కదా !!

11. RRR :

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. దర్శక ధిగ్గజంపై చాలా నమ్మకముంది తెలుగు ప్రేక్షకులకి. ఈ సినిమా పక్కా హిట్ అని అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ సినిమా 2020లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీఅభిమానులు.

RRR movie, RRR movie images, ciniaddict
RRR movie| RRR Movie images| ciniaddict




Friday 19 July 2019

Ram CharanTej Movies List | Ram charan Movies| ciniaddict

1. చిరుత - 2007  ( Chirutha )

2. మగధీర- 2009 ( Magadheera )

3. ఆరంజ్ -2010  ( Orange )


4. రచ్చ -2012 ( Rachha )


5. నాయక్- 2013 ( Nayak )


 6. ఎవడు -2014 ( Yevadu )


7. గోవిందుడు అందరి వాడేలే -2014 ( Govindhudu Andhari Vaadelae )


8. బ్రూస్లీ-2015 ( Bruce lee )


 9. ధృవ -2016  ( Dhruva )


10. ఖైదీ నెంబర్ 150- 2017 ( అతిధి పాత్ర ) ( Khaidhi Number 150 )


11. రంగస్థలం -2018 ( Rangasthalam )


వినయ విధేయ రామ- 2019 ( Vinaya Vidheya Raama )

indian heroines who married young in telugu

తమకన్నా తక్కువ వయసున్న హీరోలను పెళ్లాడిన హీరోయిన్లు ఎవరో తెలుసా ?? 1. నమ్రత శిరోద్కర్ :    నమ్రత టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో పరిచయం అక...