"మగధీర "తెలుగు సినిమా చరిత్రలోనే సంచలనం. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ఒక అద్భుతం. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయిపోయారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నేటికీ మరపు రానివ్వవు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మగధీర సినిమా చరణ్ కి కావాల్సినంత గుర్తింపు, క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇది తన రెండవ సినిమా
అయినప్పటికీ చరణ్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.
ఎస్.ఎస్ రాజమౌళి....తన సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్ని ఎప్పుడు నిరుత్సాహపడనివ్వడు . ఈ దర్శకుడి ప్రతి సినిమా ఒక కళాఖండం అని చెప్పవచ్చు.
దర్శకత్వం వహించింది రాజమౌళి అయినా , కథ అందించింది మాత్రం కె . వి విజయేంద్ర ప్రసాద్. ఈ రచయిత అందించిన అన్ని కథలు హిట్టే. మగధీర సినిమాకి అల్లు అరవింద్, బి.వి.ఎస్.యెన్ ప్రసాద్ నిర్మాతలు.
31 జులై 2009 లో విడుదలైంది ఈ చిత్రం. చరణ్ సరసన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ నటించింది. కాజల్ తనదైన నటన, అందంతో అందరిని కట్టిపడేసింది.సినిమాలో హీరో, హీరోయిన్ లతో పాటు ఇతర నటీనటులు కూడా చక్కగా పాత్రలలో ఒదిగిపోయారు. వసూళ్ల వర్షం కురిపించడంతోపాటు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. అలాంటి అరుదైన సినిమాలలో అవకాశం దొరకడం అదృష్టమే అని చెప్పాలి.

magadheera, ramcharan, kajal , s.s. rajamouli | ciniaddict |