rakshashudu movie, bellamkonda sai srinivas, ciniaddict |
ఇటీవల విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ " సీత " సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. కొత్త కథే అయినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది ఆ చిత్రం. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సక్సెస్ ని అందుకోవడానికి రాక్షషుడిగా మారాడు. విషయం ఏమిటంటె బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో "రాక్షషుడు " సినిమాలో నటిస్తున్నాడు. శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
యాక్షన్ , థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 18 , 2019 న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం హిట్ కోసం తాపత్రయపడుతున్న బెల్లంకొండ ఈ సినిమాతో సక్సెస్ ని అందుకుంటాడేమో వేచిచూడాల్సిందే.