Friday 26 July 2019

Tollywood heroes real names| తెలుగు హీరోల అసలు పేర్లు| ciniaddict

1. Prabhas                                    :Venkata Satyanarayana Prabhas Raju Uppalapati 
                                           

2. Chiranjeevi                        : konidela siva sankara vara prasad 
                                                  

3. Pawan Kalyan                    : Kalyan Babu Konidela


4. Nani                                     : Naveen Babu Ghanta


5.Nithiin                                  :Nithiin Kumar Reddy


6. Mahesh Babu                     : Mahesh Babu Ghattamaneni


7. Ram                                     : Ram Pothineni


8. NTR                                     : Nandamuri Taraka Rama Rao


9. Nagarjuna                           : Nagarjuna Rao Akkineni


10. Akhil                                  : Akhil Akkineni


11. Nagachaitanya                  Nagachaitanya Akkineni


12. Manoj                                 : Manchu Manoj Kumar


13. vishnu                                 :Manchu Vishnu Vardhan 


14.Sreenivas                             : Bellamkonda sai srinivas


15. Ram charan                       : Ram Charan Tej Konidela


16. Suriya                                 : Saravanan Sivakumar


17. Karthi                                 : Karthik Sivakumar


18. Nikhil                                  : Nikhil Siddhartha


19. Balakrishna                        : Nandamuri Balakrishna


20. Rana                                    : Ramanaidu Daggubati


21. Sushanth                             : Anumolu Sushanth



22. Mohan Babu                       : Bhaktavatsalam Naidu


23. Rajasekhar                          : Rajasekhar Varadharjan Pillai


24. Sharwanand                         : Sharwanand                         



25. Allari Naresh                       : Edara Naresh


26. Gopichand                            : Gopichand  Tottempudi                         


27. Kalyan Ram                        : Kalyan Ram  Nandamuri


28. Vijay Devarakonda             : Vijay Sai Devarakonda


29. Aadi                                     : Aadi Pinisetty


30. Sudheer Babu                      : Sudheer Babu Posani

Low Blood Pressure| Telugu | Natural ways to Managing low BP in natural way| ciniaddict

ఆరోగ్య సమస్యలు ఎంతటి వారినైనా కుంగదీస్తాయి. ఇంక మధ్యతరగతి వారి పరిస్థితి చెప్పక్కరలేదు.  కొన్ని సాధారణ జాగ్రత్తలు అంటే తినే ఆహరం, వ్యాయామం లాంటి వాటిపై కొద్దిగా శ్రద్ధ చూపితే ఆరోగ్యంగా ఉండొచ్చు. తక్కువ రక్తపోటు వున్నవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రక్తపోటుని బ్యాలన్స్ చేసుకోవచ్చు.

1. ఉప్పు ఎక్కువ వున్న పదార్థాలు తీసుకోవడం :

రక్తపోటు నియంత్రించుకోవడం పూర్తిగా మనం తినే ఉప్పు మోతాదుపై ఆధారపడి ఉంటుంది. 
కాబట్టి తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు బాగా తగ్గినప్పుడు నిమ్మరసంలో చక్కెరకు బదులుగా ఉప్పు వేసుకొని తాగితే వెంటనే రక్తపోటుని బాలన్స్ చేయవచ్చు.


LOW BP , how to prevent low bp in telugu language
LOW BP , how to prevent low bp in telugu language | ciniaddict

2. ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి :

తక్కువ రక్తపోటు రావడానికి ఆహరం సరిగా తీసుకోకపోవడం కూడా ఒక కారణం. సమయానికి  ఆహారాన్ని తీసుకోవడం  వలన దీనిని అధిగమించవచ్చు . కాబట్టి  తక్కువ రక్తపోటు ఉన్నవాళ్లు వేలకు ఆహారాన్ని తీసుకోవాలి. 


3. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి :

మద్యపానం, ధూమపానాలకి దూరంగా ఉండాలి. ఈ వ్యసనాలు రక్తపోటుకే కాకుండా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.

low bp , avoid smoking & drinking| ciniaddict
low bp | avoid smoking & drinking| ciniaddict


4. వదులుగా వుండే వస్త్రాలని ధరించాలి :

ప్రస్తుతం యువత ఫాషన్ మోజులో పడిపోయింది. వేసుకునే వస్త్రాల విషయంలో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. శరీరానికి అతుక్కుని వుండే వస్త్రాలనే ధరిస్తున్నారు. దీనివలన శరీరంలో రక్తప్రసరణ సరిగా ఉండదు. కాబట్టి వదులుగా వుండే వస్త్రాలని ఎక్కువగా ధరించాలి.

5. శారీరక కార్యకలాపాలు :

తక్కువ రక్తపోటు వున్నవారు నిద్ర లేచేటప్పుడు లేదా నేలమీద   కూర్చుని లేచేచేటప్పుడు
సడన్ గా లేవకూడదు. కాస్త నెమ్మదిగా లేవాలి. సడన్ గా లేవడం వలన కళ్ళుతిరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి , నెమ్మదిగా లేవాలి. 
low bp symptoms, low bp treatment,
how to overcome Low BP | ciniaddict



Wednesday 24 July 2019

Magadheera Movie | Ramcharan Magadheera Movie | ciniaddict

"మగధీర "తెలుగు సినిమా  చరిత్రలోనే సంచలనం. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ఒక అద్భుతం. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయిపోయారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నేటికీ మరపు రానివ్వవు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మగధీర సినిమా చరణ్ కి కావాల్సినంత గుర్తింపు, క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇది తన రెండవ సినిమా
అయినప్పటికీ చరణ్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.
                 
                             ఎస్.ఎస్ రాజమౌళి....తన సినిమా చూడడానికి వచ్చిన  ప్రేక్షకుల్ని ఎప్పుడు  నిరుత్సాహపడనివ్వడు . ఈ దర్శకుడి  ప్రతి సినిమా ఒక కళాఖండం అని చెప్పవచ్చు.
దర్శకత్వం వహించింది రాజమౌళి అయినా , కథ అందించింది మాత్రం కె . వి విజయేంద్ర ప్రసాద్. ఈ రచయిత అందించిన అన్ని కథలు హిట్టే. మగధీర సినిమాకి అల్లు అరవింద్, బి.వి.ఎస్.యెన్ ప్రసాద్ నిర్మాతలు.

                              31 జులై 2009 లో విడుదలైంది ఈ చిత్రం. చరణ్ సరసన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ నటించింది. కాజల్ తనదైన నటన, అందంతో అందరిని కట్టిపడేసింది.సినిమాలో హీరో, హీరోయిన్ లతో పాటు ఇతర నటీనటులు కూడా చక్కగా పాత్రలలో ఒదిగిపోయారు. వసూళ్ల వర్షం కురిపించడంతోపాటు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. అలాంటి అరుదైన సినిమాలలో అవకాశం దొరకడం అదృష్టమే అని చెప్పాలి.

Magadheera movie, Ramcharan tej, kajal agarwal, s.s rajamouli
magadheera, ramcharan, kajal , s.s. rajamouli | ciniaddict

                                 
                            

Friday 19 July 2019

Chirutha Movie| Ram Charan Tej Chirutha Movie| ciniaddict

చిరుత - 2007 ( Chirutha ) :

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ ( చెర్రీ  ) "చిరుత " సినిమాతో వెండి తెరకు , తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. చరణ్ కి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ చక్కగా నటించాడు. మొదటి సినిమాతోనే తనలోని మాస్ యాంగిల్ ని ప్రేక్షకులకి పరిచయం చేసాడు. అయినా పూరిజగన్నాథ్ హీరో అంటే  ఆమాత్రం ఉండాల్సిందే. పూరీ సినిమాలు అన్ని మాస్ ఆడియన్స్ ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయవు. అలాగే ఈ సినిమా కూడా మాస్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మెగా వారి అబ్బాయికి తొలి సినిమాతోనే మంచి పేరు విజయం దక్కింది. ఈ సినిమాలో నేహా శర్మ కథానాయిక. చిరుత సినిమా సెప్టెంబర్ 28, 2007 లో విడుదలైంది. ప్రకాష్ రాజ్, అలీ, బ్రహ్మానందం వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటించారు.

                చిరుత సినిమా తెలుగు లోనే కాకుండా, తమిళంలో కూడా విడుదలైంది.మలయాళం,  బెంగాలీ భాషల్లో కూడా డబ్ చేయబడింది.  దేశ వ్యాప్తంగా పలు  రాష్ట్రాలలో 708 స్క్రీన్స్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలు అన్ని ఆకట్టుకున్నాయి. ఎట్టకేలకు రామ్ చరణ్ కి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.


Ram CharanTej Movies List | Ram charan Movies| ciniaddict

1. చిరుత - 2007  ( Chirutha )

2. మగధీర- 2009 ( Magadheera )

3. ఆరంజ్ -2010  ( Orange )


4. రచ్చ -2012 ( Rachha )


5. నాయక్- 2013 ( Nayak )


 6. ఎవడు -2014 ( Yevadu )


7. గోవిందుడు అందరి వాడేలే -2014 ( Govindhudu Andhari Vaadelae )


8. బ్రూస్లీ-2015 ( Bruce lee )


 9. ధృవ -2016  ( Dhruva )


10. ఖైదీ నెంబర్ 150- 2017 ( అతిధి పాత్ర ) ( Khaidhi Number 150 )


11. రంగస్థలం -2018 ( Rangasthalam )


వినయ విధేయ రామ- 2019 ( Vinaya Vidheya Raama )

Wednesday 17 July 2019

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ( Made for each other ) | ciniaddict

Allu Arjun wedding images, Allu Arjun, Sneha Reddy
Allu Arjun wedding images | ciniaddict

                    స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు. తన నటన, స్టైల్,  డాన్సులతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆర్య లాంటి సరికొత్త ప్రేమ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక , ట్రెండ్ ని సెట్ చేసాడు ఈ హీరో. ఎప్పుడు ప్రేమ కథలతో హిట్లు కొట్టే అల్లు వారి అబ్బాయి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ పెళ్లే అయినప్పటికీ, పెద్దల సమక్షంలో పెళ్లి  జరిగింది . తెలిసిన స్నేహితుల వేడుకలో మొదటి సారి స్నేహ రెడ్డి ని చూసిన అల్లుఅర్జున్ చూడగానే ప్రేమలో పడిపోయాడు. స్నేహ కూడా తొలిచూపులోనే అర్జున్ తో ప్రేమలో పడిపోయింది. కొన్ని రోజులు ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకున్న తర్వాత మార్చి 6, 2011 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి బారీగా అభిమానులు, సినీప్రముఖులు తరలివచ్చారు.
మాదాపూర్ లోని హైటెక్ గ్రౌండ్స్ లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ రూపంలో పెళ్లి మండపాన్ని రూపొందించారు. ఆకాశమంత పందిరి , భారీ బంధుజనం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది అర్జున్, స్నేహాల వివాహం.   వీరికి అయాన్ , అర్హ సంతానం.. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిని సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు అల్లు అర్జున్.

Allu Arjun wedding images, Allu Arjun, Sneha Reddy
Allu Arjun and sneha reddy wedding images | ciniaddict



Monday 15 July 2019

జూనియర్ ఎన్టీఆర్ , లక్ష్మి ప్రణతి ( Made for each other ) | ciniaddict

జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న నందమూరి తారక రామారావు మనవడు, హరికృష్ణ కొడుకు.తెలుగు ప్రజల చేత  తాతకు తగ్గ మనవడు , తాతకు సరైన వారసుడు అని అనిపించుకున్నాడు ఎన్టీఆర్. పోలికలలో అచ్చం సీనియర్ ఎన్టీఆర్ లాగ ఉండటమే కాకుండా, నటనలో కూడా తాతగారికి ఏమాత్రం తీసిపోడు. తెలుగులో ఏ హీరోకి లేని క్రేజ్ ఎన్టీఆర్ సొంతం. అంతలా తన నటనతో, డాన్సులతో అందర్నీ ఆకట్టుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ హిట్లని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మే 7, 2011 లో లక్షిప్రణతిని వివాహం చేసుకున్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరి వివాహానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే లక్ష్మి ప్రణతి , ఎన్టీఆర్ కన్నా 10 సంవత్సరాలు చిన్నది కావడంతో పలు విమర్శలు వచ్చాయి. ప్రణతికి పెళ్లి సమయానికి 18 సంవత్సరాలే అవ్వటంతో పలు విమర్శలు వచ్చాయి. వీరిరువురు మధ్య వయసులో తేడా ఉన్నప్పటికీ అర్థం చేసుకోవడంలో నూటికి నూరు మార్కులు పడ్డాయి. ఎన్టీఆర్ , లక్ష్మి ప్రణతి జంట మాత్రం అన్యోన్యంగా వుంటూ, ఆనందంగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ సంతానం. అటు పర్సనల్ , ఇటు ప్రొఫెషనల్ కెరీర్ ని బ్యాలన్స్ చేస్తూ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ..

jnr ntr marriage images, jnr ntr marriage date, ciniaddict
jnr ntr marriage images

jnr ntr marriage images, jnr ntr marriage date, ciniaddict
jnr ntr and lakshmi pranathi marriage images | ciniaddict

jnr ntr marriage images, jnr ntr marriage date, ciniaddict
NTR & Lakshmi Pranathi Wedding photos | ciniaddict



విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ( Made for each other ) | ciniaddict

విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానుల ఆరాధ్య దైవం. బహుశా మనదేశంలో కోహ్లీ తెలియని వారులేరేమో.అంతగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈయన రంగంలోకి దిగితే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రస్తుతం కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. కోట్లమంది మనసులు గెలుచుకున్న కోహ్లీ మనసు మాత్రం బాలీవుడ్ అందాలభామ అనుష్క శర్మ గెలుచుకుంది. వీరిరువురు కొంత కాలం ప్రేమించుకుని డిసెంబర్ 11, 2017 లో వివాహం చేసుకున్నారు. పెళ్ళికి ముందు  వీరిరువురి మధ్య పలు ఆరోపణలు వచ్చాయి. వారిరువురు ప్రేమలో వున్నప్పుడ్డు అనుష్క శర్మ క్రికెట్ స్టేడియంకి వెళ్లిన సందర్భంలో కోహ్లీ అనుష్క వైపుచూస్తూ ఆట మీద దృష్టి సాధించలేదని పలు రూమర్లు వచ్చాయి. ఎంత మంది తనని , అనుష్కని విమర్శిస్తున్నా కోహ్లీ అనుష్కకి సపోర్ట్ ఇచ్చాడు. అనుష్క విషయంలో ఎంతో భాద్యతగా వ్యవహరించాడు కోహ్లీ. అనుష్క విషయంలో కోహ్లీ ప్రవర్తనకు అభిమానుల నుంచి ప్రశంసలు, విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా కోహ్లీ , అనుష్క పట్ల తనకున్న ప్రేమని , గౌరవాన్ని చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. ఇంతగా అర్థం చేసుకునే భర్త దొరకడం అనుష్క శర్మ అదృష్టం. అనుష్క శర్మ కూడా కోహ్లీ పట్ల ఎల్లప్పుడూ ప్రేమను చాటుతూనే ఉంటుంది. మొత్తానికి ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ 

virat kohli, anushka sharma wedding images| ciniaddict

anushka, virat marriage photos| ciniaddict

virat kohli, anushka sharma images| ciniaddict

anushka sharma, virat kohli images| ciniaddict

"virushka" wedding images|ciniaddict

నాగచైతన్య , సమంత ( Made for each other ) | ciniaddict

Nagachaitanya, samantha marriage photos, Nagachaitanya wedding images, ciniaddict
Akkineni Nagachaitanya, samantha wedding photos | ciniaddict

అక్కినేని నాగచైతన్య యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. జోష్ సినిమాతో తన సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టిన చైతన్య టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు.
వ్యక్తిగతంగా చైతన్య సౌమ్యంగా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. తన పనేంటో తాను చేసుకుంటూ ఉంటాడు. అలాంటి చైతన్య సమంతతో ప్రేమలో పడ్డాడు. ఎమ్మాయచేసావే వీరిరువురు కలిసి నటించిన మొదటి సినిమా.ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసిన వారందరు వీరిరువురి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనుకున్నారు. ఎమ్మాయచేసావే సినిమా తర్వాత వీరిరువురు కలిసి ఆటోనగర్ సూర్య, మనం సినిమాలలో స్క్రీన్ ని పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది . పలు ఇంటర్వ్యూలలో తానే చైతు వెంట పడిందని, కానీ చైతన్య మాత్రం వేరే అమ్మాయిల వెంట పడ్డాడని చెప్పింది సమంత. వీరిద్దరి వివాహం సన్నిహితుల మధ్య గోవాలో ఘనంగా జరిగింది. మొదటగా హిందూ పద్దతిలో, తర్వాత క్రైస్తవ పద్దతిలో వివాహం చేసుకున్నారు. 

     సమంత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాలలో నటిస్తోంది. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి మజిలీ సినిమాలో నటించి మెప్పించారు. 

Nagachaitanya, samantha marriage photos, Nagachaitanya wedding images, ciniaddict
Akkineni Nagachaitanya, samantha wedding photos | ciniaddict


Nagachaitanya, samantha marriage photos, Nagachaitanya wedding images, ciniaddict
Akkineni Nagachaitanya, samantha wedding photos | ciniaddict


రామ్ చరణ్, ఉపాసన ( Made for each other ) | ciniaddict

రామ్ చరణ్  కొణిదెల , తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్. చరణ్ 14 , జూన్ 2012 లో ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు. ఉపాసన  ప్రతాప్ సి రెడ్డి మనువరాలు. ఉపాసన తల్లిదండ్రులు శోభన కామినేని, అనిల్ కామినేని. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరిరువురి మధ్య ఎంతో అన్యోన్యత ఉంటుంది.

         రామ్ చరణ్ , ఉపాసన పెళ్లి సమయంలో వీరిరువురిని చూసిన జనాలు  చెర్రీకి ఉపాసన సెట్ అవ్వదని, చెర్రీ కన్నా పెద్దదానిలా కనిపిస్తోందని  పలు విమర్శలు చేశారు. కానీ మనిషికి కావాల్సింది మంచి మనస్సు కానీ, అందం కాదని ఈ జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో ఈ జనాలు. అయినా ఉపాసన అందంగా లేదని ఎవరన్నారు. ఒకప్పుడు బొద్దుగా ఉన్నాకూడా ఇప్పుడు బరువు తగ్గి నాజూకుగా తయారైంది ఉపాసన. సామజిక సేవ చేయడంలో ముందుండే ఉపాసన మెగాస్టార్ చిరంజీవికి తగిన కోడలు అనిపించుకుంది.


Ramcharan upasana marriage photos, Ramcharan upasana wedding images, ciniaddict
Ramcharan, upasana wedding photos| ciniaddict
Ramcharan upasana marriage photos, Ramcharan upasana wedding images, ciniaddict
Ramcharan, upasana wedding photos| ciniaddict


Ramcharan upasana marriage photos, Ramcharan upasana wedding images, ciniaddict
Ramcharan, upasana wedding photos| ciniaddict

Ramcharan upasana marriage photos, Ramcharan upasana wedding images, ciniaddict
Ramcharan, upasana wedding photos| ciniaddict


Sunday 14 July 2019

తెలుగు తెరపై ప్లాస్టివ్ బొమ్మలు !! | ciniaddict

సినిమా రంగం ....అందమైన రంగుల ప్రపంచం . ఎంతో మంది సినిమా రంగంలో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో నటించే వారందరు తెలుగు వారే. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలలో హీరోయిన్లు , ప్రతినాయకులు వేరే రాష్ట్రాల వారే. ఎంతోమంది తెలుగు యువతీయువకులు ఉన్నప్పటికీ కూడా మన దర్శకనిర్మాతలు పొరుగు రాష్ట్రాల వారికే అవకాశమిస్తున్నారు. అందులోనూ హీరోయిన్ల పరిస్థితి మరీ ఘోరం. పేరుకు తెలుగు సినిమాలే కాని ఒక్క తెలుగు అమ్మాయి కూడా స్టార్ హీరోయిన్ గా లేదు టాలీవుడ్ లో. బయటనుంచి అరువు తెచ్చుకున్న ప్లాస్టిక్ అందాలే. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.


1. సమంత రూత్ ప్రభు :

        ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లలో మొదటి లిస్టులో ఉంటుంది సమంత. 2007 మాస్కోవిన్ కావేరి అనే తమిళ సినిమాకు సైన్ చేసింది. 2010 లో ఎమ్మాయచేసావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.  సినిమాలలోకి రాకముందు సమంత మోడలింగ్ చేసేది. అప్పటి సమంతని చూసిన అభిమానులు , ఈమె సమంతానా ?? మేము నమ్మం అంటున్నారు. అభిమానులకి నమ్మకం కలగకపోయిన అది నిజమే..


samantha plastic surgery, samantha before plastic surgery, samantha after plastic surgery
samantha before plastic surgery| ciniaddict

సమంత తొలినాళ్లలో చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో చూసిన వారందరు గొంగళిపురుగు టు సీతాకోకచిలుక అని కామెంట్లు చేస్తున్నారు. పలు ప్లాస్టిక్ సర్జరీలే కాకుండా , తన స్కిన్ రంగు మార్చుకోవడానికి కూడా శస్త్రచికిత్సలు చేయించుకుంది.

samantha plastic surgery, samantha before plastic surgery, samantha after plastic surgery
samantha after plastic surgery| ciniaddict
   2. నయనతార :

            నయనతార తెలుగు , తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. 2003లో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసేది నయనతార. అలా మోడలింగ్ చేస్తూ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.  వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ , తాను తన అందంతో తృప్తి చెందలేదో ఏమో, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది.

Nayanatara plastic surgery, Nayanatara before plastic surgery, Nayanatara after plastic surgery
nayanatara plastic surgery images| ciniaddict

3. శృతిహాసన్ :

             శృతిహాసన్ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పిచింది. తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వం వహించిన "హే రామ్ "అనే సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఈ భామ కూడా తన అందంతో తృప్తిచెందక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది.

sruthi hasan plastic surgery, sruthi hasan before plastic surgery, sruthi hasan after plastic surgery
sruthi hasan plastic surgery images| ciniaddict



4. ఆసిన్ :

           ఆసిన్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో తెలుగు  ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ భామ కూడా తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

asin before plastic surgery images, asin after plastic surgery images,
asin plastic surgery images| ciniaddict



Thursday 11 July 2019

మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు ఏంటో తెలుసా??| ciniaddict

chiranjeevi real name, ciniaddict
megastar chiranjeevi real name



                 మెగాస్టార్ చిరంజీవి!! తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. తెలుగు సినీఅభిమానులనే కాకుండా యావత్ సినీప్రేక్షకులని తనదైన నటన, డాన్సులతో ఆకట్టుకున్నారు చిరంజీవి. ఇప్పుడు టాలీవుడ్ లో వున్నా చాలామంది హీరోలు చిరంజీవి గారిని ప్రేరణగా తీసుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టినవారే . సినిమా రంగంలో చెరగని ముద్ర వేసిన చిరంజీవి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని మొగలితుర్రు. కొణిదెల వెంకట్రావు, కొణిదెల అంజనాదేవి దంపతులకు ఆగష్టు 22 , 1955 న జన్మించారు చిరంజీవి.

   

chiranjeevi real name, chiranjeevi latest movies
chiranjeevi real name| chiranjeevi old movies| ciniaddict


                చిరంజీవికి తన తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. పునాది రాళ్లు సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి సినిమా రంగంలో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151 వ చిత్రం . ఈ సినిమాకి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మాత కావడం విశేషం. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

350 కోట్లతో తెరకెక్కనున్న రాజమౌళి సినిమా !! | ciniaddict


RRR movie, ciniaddict
RRR movie, ciniaddict
                 మాములుగా సినిమా హీరోలకి ఎక్కువగా అభిమానులు వుంటారు. కానీ టాలీవుడ్ లో మాత్రం దీనికి విభిన్నం. ఏ స్టార్ హీరో కి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి. అతను ఎవరు అంటే టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి. ఈ దర్శకుడి సినిమా మొదలయినప్పటినుంచి సినిమా విడుదల అయ్యేవరకు అభిమానుల్లో చెప్పలేని కుతూహలం. ఎందుకంటె ఈ దర్శకుడి సినిమాలు అంత సస్పెన్సు తో ఉంటాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై , ఊహించని విజయాన్ని అందుకోవడమే కాక, తెలుగు సినిమా స్థాయిని పెంచింది. బాహుబలి తర్వాత రాజమౌళి తీయబోయే తర్వాతి చిత్రంపై అభిమానుల్లో  భారీ అంచనాలున్నాయి.


            అభిమానుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా  రాజమౌళి భారీ కథ, టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీయార్ తో RRR సినిమా తీస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ ఆలియాభట్ కథానాయికగా నటిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రం లో అజయ్ దేవగన్ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ చిత్రం దాదాపు 350 కోట్లతో తెరకెక్కనుంది. ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంవిడుదల కోసం  టాలీవుడ్లోనే కాకుండా భారతీయ సినిమా మొత్తం  ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా జులై 30, 2020 విడుదల కానుందని సమాచారం. 

Monday 8 July 2019

మన్మధుడితో జతకట్టిన రకుల్ !! | ciniaddict

manmadhudu 2 images
Manmadhudu 2 movie, akkineni nagarjuna, rakul


మన్మధుడు అనగానే గుర్తొచ్చేపేరు అక్కినేని నాగార్జున. నాగార్జున నటించిన "మన్మధుడు" సినిమా 2002 డిసెంబర్ 20న విడుదలైంది. ఈ సినిమాలో సోనాలి బింద్రే , అన్షు  కథానాయికలుగా నటించారు. భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూళ్ళని కూడా రాబట్టింది ఈసినిమా. అక్కినేని నాగార్జున నటించిన సినిమాల్లో ఈ సినిమా ప్రత్యేకమైనది. అందుకేనెమో నాగార్జున స్వయంగా మన్మధుడు 2 సినిమాని నిర్మిస్తున్నారు.

    మన్మధుడు 2 ప్రేమ కథకి  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున తో జతకట్టింది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో సమంత అక్కినేని, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిధి పాత్రలలో నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ , నాసర్, లక్ష్మి, దేవదర్శిని , ఝాన్సీ, రావు రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మన్మధుడు 2 సినిమా ఆగష్టు 9 ,2019 విడుదలకి సిద్ధమైంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని అంటున్నారు. అక్కినేని అభిమానులు . 

టాలీవుడ్ లోకి రాక్షషుడు రాబోతున్నాడు !! | ciniaddict

rakshashudu movie, bellamkonda sai srinivas, ciniaddict

                  ఇటీవల విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ " సీత " సినిమా   అనుకున్నంత విజయాన్ని   సాధించలేదు. కొత్త కథే అయినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది ఆ చిత్రం. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సక్సెస్ ని అందుకోవడానికి రాక్షషుడిగా మారాడు. విషయం ఏమిటంటె బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో "రాక్షషుడు " సినిమాలో నటిస్తున్నాడు. శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
            యాక్షన్ , థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 18 , 2019 న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం హిట్ కోసం తాపత్రయపడుతున్న బెల్లంకొండ ఈ సినిమాతో సక్సెస్ ని అందుకుంటాడేమో వేచిచూడాల్సిందే. 

Sunday 7 July 2019

కబీర్ సింగ్ అవతారమెత్తిన అర్జున్ రెడ్డి !! | ciniaddict




              అర్జున్ రెడ్డి !! టాలివుడ్ చిన్న సినిమాల  చరిత్రలోనే  అతిపెద్ద సంచలనం. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకి సందీప్ వంగ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షాలిని పాండే కథానాయిక. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించారు సందీప్ వంగ.  హిందీ వెర్సన్ లో షాహిద్ కపూర్ హీరోగా, కైరా అద్వానీ కేరోయిన్ గా నటించారు.

            అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించ్చినప్పటికీ పలు విమర్శలకు తావిచ్చింది. షాహిద్, కైరా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా హిందీలో కూడా భారీ వసూళ్ళని రాబట్టింది. షాహిద్ కపూర్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్టుగా నిలిచింది. కబీర్ సింగ్ విడుదలైన మొదటి రోజే 20 కోట్లకు పైనే వసూళ్ళని రాబట్టింది. ప్రస్తుతం సందీప్ వంగ కబీర్ సింగ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

indian heroines who married young in telugu

తమకన్నా తక్కువ వయసున్న హీరోలను పెళ్లాడిన హీరోయిన్లు ఎవరో తెలుసా ?? 1. నమ్రత శిరోద్కర్ :    నమ్రత టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో పరిచయం అక...